‘డయల్‌ 100’కు 2,997 ఫోన్‌కాల్స్‌


Wed,September 11, 2019 12:27 AM

నిజామాబాద్‌ క్రైం : రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలతో నిర్వహిస్తున్న డయల్‌ 100 కార్యక్రమానికి నెల రోజుల్లో 2997 కాల్స్‌ వచ్చినట్లు కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ సంఘటనలు జరిగినా ప్రజలు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన్నట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు జిల్లాలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నుంచి మొత్తం 2,997 ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లుగా తెలిపారు. బాడిలీ అఫెన్స్‌స్‌-116, యాక్సిడెంట్‌ -471,ప్రాపర్టీ అఫెన్సెస్‌ -67, సూసైడ్‌, సూసైడ్‌ అటంప్ట్స్‌ -54, ఇతర కేసులు -2,230, తప్పుడు(ఫాల్స్‌) కాల్స్‌ 59 వచ్చాయని ప్రకటనలో వెల్లడించారు. ఫోన్‌కాల్స్‌ వచ్చిన 5 నిమిషాల వ్యవధిలోనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకొని తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫాల్స్‌ కాల్స్‌తో సమయం వృధా అవుతుందని, అంతేకాకుండా సమస్య ఉన్నవారికి సరైన సమయంలో స్పందించడానికి వీలు లేకుండా పోతున్నట్లు దీనిని ప్రజలు గ్రహించాలని కోరారు. డయల్‌ 100కు తప్పుడు ఫోన్‌కాల్స్‌ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...