కారు నడుపుతూ..కాళేశ్వరం పాటలు వింటూ


Wed,September 11, 2019 12:27 AM

-వరద కాలువను చుట్టేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
-సన్మానలు వద్దని రైతులకు వారింపు
కమ్మర్‌పల్లి,నమస్తే తెలంగాణ/ముప్కాల్‌ : వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ తీరాన్ని తాకిన వేల మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలో ఎంతో ఆనందం, ఉత్సాహం కనిపించాయి. రైతుల్లో కనిపించిన ఆనందాన్ని చూసి ఆయన ఎంతో ఉత్సాహం పొందారు. పునరుజ్జీవ పథకాన్ని విజయవంతం చేసిన సందర్భంగా మంగళవారం రైతులు, నాయకులు మంత్రిని సన్మానించేందుకు శాలువాలు, పూలదండలతో తరలివచ్చారు. మంత్రి సన్మానాలను సున్నితంగా తిరస్కరించారు. మీలో నెలకొన్న ఆనందాల సమయంలో నాలో కలుగుతున్న సంతోషమే ముఖ్యం, సన్మానాలు వద్దన్నారు. వందలాది మంది రైతులతో ఉత్సాహంగా కరచలనం చేసిన ఆయన , కార్యక్రమం అనంతరం వరద కాలువలోని జలాలను తిలకించేందుకు స్వయంగా కారు నడుపుతూ బయలుదేరారు. ప్రచార రథంలో నాయకులను ఎక్కించుకొని.. స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ ఎస్సారెస్పీ జీరో పాయింట్‌ నుంచి ముప్కాల్‌, వేంపల్లి, వన్నెల్‌-బి, పోచంపల్లి వరకు వరద కాలువ కట్ట మీదుగా వెళ్లి జలాలను తిలకించారు. కారు నడుపుతూ.. కారులో ‘కాళేశ్వరం.. జల కాళేశ్వరం.. కేసీఆర్‌ కళల పంట కాళేశ్వరం’ అనే పాటకు హామ్‌ చేస్తూ వరద కాలువను చుట్టి వచ్చారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...