యూరియా పంపిణీ


Tue,September 10, 2019 12:50 AM

మోపాల్ : మండల కేంద్రంలో యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమం సోమవారం కొనసాగింది. మండల కేంద్రంలోని సహకార సంఘంలో 40 టన్నుల యూరియా రావడంతో రైతులు యూరియా బస్తాలు తీసుకె ళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ ఉమాపతిరావు మాట్లాడుతూ.. సోమవా రం ఒక్కరోజు 900 బస్తాలను అందజేశామన్నారు. ఇప్పటివరకు మోపా ల్‌లో వంద టన్నుల యూరియా, మంచిప్పలో, బోర్గాంలో 12 టన్నుల యూరియా బస్తాలు అందజేశామన్నారు. మరో వంద టన్నుల యూరి యా రానుందని, నాలుగైదు రోజుల్లో అందరికీ అందుతాయని ఆందోళన కు గురి కావాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు.

అందరి సహకారంతో సమస్యలు దూరం..
ధర్పల్లి : గ్రామంలో 30 రోజుల ప్రణాళికకు అందరి సహకారంతో పక డ్బందీగా అమలు చేసి గ్రామంలో సమస్యలు లేకుండా చూద్దామని స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్‌రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎంపీపీ నల్ల సారికారెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సహకరించినప్పుడే గ్రామాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేసుకోగల మని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, ఎంపీటీసీ సుజావొద్దీన్, అధికారులు ఏవో ప్రవీణ్, ఉప సర్పంచ్ భారతిరాణి రామస్వామి, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...