కేసీఆర్‌కు పింఛన్‌దారులు రుణపడి ఉంటారు


Tue,September 10, 2019 12:49 AM

జక్రాన్‌పల్లి : పింఛన్ డబ్బులు పెంచి నిరుపేదలను ఆదుకుంటున్న ముఖ్య మంత్రి కేసీఆర్‌కు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు రుణపడి ఉంటారని వైస్ ఎంపీపీ కుంచాల విమల అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పెంచిన పింఛన్లను మండలంలో సికింద్రాపూర్ గ్రామంలో సోమవారం పంపిణీ చేశారు. అనంతరం వైస్ ఎంపీపీ మాట్లాడుతూ.. నిరుపేదలకు పెద్ద కొడులా, మహిళలకు పెద్దన్నలా కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి పింఛను పెంచి ఆదుకుంటున్నారన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పెంచిన పింఛన్లను ఆయా గ్రామాల సర్పంచులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగామణి, ఉప సర్పంచ్ అరుణ్, మాజీ ఎంపీటీసీ కుంచాల రాజు, వార్డు సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...