రాంపూర్ పంపుహౌస్‌లో ఐదో యూనిట్ వెట్న్ సక్సెస్


Tue,September 10, 2019 12:49 AM

కమ్మర్‌పల్లి/నమస్తే తెలంగాణ: ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం కింద అర టీఎంసీ నీటిని అందించేలా పూర్తిగా సిద్ధమైంది. ఈ దశలో రాంపూర్ పంపుహౌస్‌లో ఐదో యూనిట్‌లో మోటారుకు అధికారులు సోమవారం మధ్యాహ్నం వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించారు. రాంపూర్ పంపుహౌస్‌లో ఇది వరకే అర టీఎంసీ నీటిని అందించేలా నాలుగు మోటార్లను సిద్ధం చేసి నాలుగింటికి వెట్న్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు సోమవారం ఐదో మోటారు వెట్న్‌న్రు పూర్తి చేశారు. 40 నిమిషాల పాటు వెట్న్ నిర్వహించారు. మోటారు ఉష్ణోగ్రత, వేగం, శబ్ధం తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటరెడ్డి, ప్రాజెక్టు ఇన్‌చార్జి సుధాకర్ రెడ్డి, వరద కాలువ ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ సుధాకిరణ్, డీఈ రాంప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...