యూరియాకు రైతులు ఆందోళన చెందొద్దు


Mon,September 9, 2019 01:48 AM

- భీమ్‌గల్‌ ఏడీఏ మల్లయ్య
కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : బాల్కొండ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి వచ్చిందని, ఎల్లుండికల్లా యూరియా కొరత అనే మాటే తలెత్తదని భీమ్‌గల్‌ ఏడీఏ కె.మల్లయ్య తెలిపారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గంలో రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. యూరియాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం భీమ్‌గల్‌ మండలానికి 200 మెట్రిక్‌ టన్నులు, వేల్పూర్‌ మండలానికి 260 మెట్రిక్‌ టన్నులు, బాల్కొండ మండలానికి 60 మెట్రిక్‌ టన్నులు, ముప్కాల్‌ మండలానికి 40 మెట్రిక్‌ టన్నులు, ఏర్గట్ల మండలానికి 140 మెట్రిక్‌ టన్నులు, కమ్మర్‌పల్లి మండలానికి 40 మెట్రిక్‌ టన్నులు, మోర్తాడ్‌ మండలానికి 40 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. సోమవారం భీమ్‌గల్‌ మండలానికి 120 మెట్రిక్‌ టన్నులు, కమ్మర్‌పల్లి మండలానికి 160 మెట్రిక్‌ టన్నులు, మోర్తాడ్‌ మండలానికి 60 మెట్రిక్‌ టన్నులు, మెండోరా మంలానికి 60 మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. బుధవారం నుంచి ప్రతి మండల కేంద్రంలో 2 వేల నుంచి 3వేల యూరియా బస్తాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో ఇక యూరియా కొరతనే ఉండదని వివరించారు.రైతులు యూరియా కోసం ఆధైర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు.క్యూ కట్టాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...