రేపటిలోగా జిల్లాకు సరిపడా సరఫరా


Mon,September 9, 2019 01:48 AM

- వ్యవసాయ అధికారి గోవింద్‌
డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: జిల్లాకు మంగళవారంలోగా సరిపడా యూరియా చేరుకుంటుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ తెలిపారు. ఆదివారం 2500 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని, దానిని సోమవారం 106 సహకార సంఘాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి సొసైటీని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2లక్షల ఎకరాల్లో వరి, 60వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో సోయా పంట రైతులు వేసినట్లు తెలిపారు. ఈసారి వరి సాగు 125శాతానికి చేరిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు యూరియా 39,500 టన్నుల యూరియా వచ్చిందని, మరో 20,500 మెట్రిక్‌ టన్నుల యూరియా ఒకటి రెండు రోజుల్లో చేరుకుంటుందని చెప్పారు. ఆంధ్రలోని విశాఖపట్టణం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి నేరుగా లారీల ద్వారా జిల్లాలోని సొసైటీలకు వచ్చిందన్నారు. ఓడ రేవుల వద్దకు నలుగురు అధికారులను ప్రత్యేకంగా పంపించామన్నారు. యూరియా మొత్తం సహకార సంఘాలు, సహకార బ్యాంకుల ద్వారా మాత్రమే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్‌, సొసైటీ చైర్మన్‌ గజవాడ జైపాల్‌, పాయింట్‌పాయింట్‌ ఆఫీసర్‌ వెంకట రవీందర్‌, సీఈవో కిషన్‌ ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...