జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేయాలి


Mon,September 9, 2019 01:48 AM

నందిపేట్‌ : గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అత్యుత్తమంగా తీర్చేందుకు 30రోజుల ప్రత్యేక కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని, జిల్లాను అభివృద్ధి పథాన నిలిపేందుకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పిలుపునిచ్చారు. నందిపేట్‌ మండలం ఆంధ్రనగర్‌లో ఆదివారం నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రధానంగా పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కనబరచాలన్నారు. అందరినీ భాగస్వాములను చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ ప్రణాళిక అమలులో అగ్రస్థానంలో నిలిచే జిల్లాకు ప్రభుత్వం రూ. 10 కోట్లు అందజేస్తుందని, ఆ గౌరవం మనకే దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రోజుకు ఒక మండలం చొప్పున జిల్లాలోని అన్ని మండలాలు పర్యటిస్తున్నట్లు చెప్పారు.అధికారులు ప్రజలతో మమేకమై ముందుకుపోవాలని సూచించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకిడి సంతోష్‌, జడ్పీటీసీ ఎర్రం యమున, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, సర్పంచ్‌ రామారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ హుస్సేన్‌, నాయకులు మజారొద్దీన్‌, వాసరి రాంచందర్‌, ఎంపీడీవో నాగవర్ధన్‌, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...