నల్లచెరువు కట్టను బలోపేతం చేయాలి


Mon,September 9, 2019 01:47 AM

కోటగిరి : మండల కేంద్రం సమీపంలో గల నల్ల చెరువు కట్ట వర్షానికి బలహీనంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేసి కట్టను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కోటగిరి సర్పం చ్‌ పత్తి లక్ష్మణ్‌ అన్నారు. వర్షానికి, కా లువ నీటి ద్వారా వచ్చిన నీటితో నల్ల చెరువు నింపిన విషయం తెలిసిందే. నల్ల చెరువు కట్ట కొంత పలచ బడడం తో పాటు మన్ను కిందకు జారుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా రైతులు రెవెన్యూ అధికారులకు, సర్పంచ్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారు ఆదివారం నల్ల చెరువుకు వచ్చి కట్టను పరిశీలించారు. చెరువులో నీరు బాగానే వచ్చాయని ఇంకా మూడు ఫీట్లు వస్తే పూర్తిగా నిండుతుందన్నారు. కానీ కట్ట మట్టి కొంత జారీ పోతుండడం తో భయమేస్తోందని రైతులు అధికారుల ఎదుట వాపోయారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కట్ట పటిష్టంగా కోసం కృషి చేస్తానని సర్పంచ్‌ భరోసా ఇచ్చారు. తహసీల్దార్‌ విఠల్‌ కట్ట బలోపేతం చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు. వీఆర్వో సాయిలు, వా ర్డు సభ్యులు దయానంద్‌, యార్లగడ్డ రవి, నీలి శంకర్‌, లింగంగౌడ్‌, పి.సాయిలు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...