నిధుల వరద


Sun,September 8, 2019 03:51 AM

-జిల్లాకు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.10.49 కోట్లు మంజూరు

ఇందూరు: పల్లెల ప్రగతి, గ్రామాల సంపూర్ణ వికాసం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక ఇప్పటికే జిల్లాలో ప్రారంభమైంది. తొలిరోజు గ్రామ సభలు నిర్వహించి సీఎం కేసీఆర్ సందేశాన్ని, గ్రామాల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాగా, గ్రామాల వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 కోట్ల 49 లక్షలను జిల్లాకు మంజూరు చేసింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల నిధులు రూ.7,30 కోట్లు కేటాయించింది. ఈ నిధులను గ్రామాల్లో పారిశుధ్యం, మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు, అభివృద్ధి పనులకు కేటాయించనున్నారు. జిల్లాలో మొత్తం 10,51,160 జనాభా ఉండగా.. జనాభా ఆధారంగా ఈ నిధులను విభజించి గ్రామపంచాయతీలకు కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులు అందినట్లు డీపీవో అధికారులు తెలిపారు.

మంజూరైన నిధులను ట్రెజరీ అధికారులకు బదిలీ చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. జిల్లాలో మొత్తం 592 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. ఆయా గ్రామపంచాయతీలు వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. వాటికి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఈ ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. అప్పుల చెల్లింపు, జీతాల చెల్లింపు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. గ్రామ పంచాయతీల ఆదాయ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులను ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...