అనుమానాస్పదంగా వివాహిత మృతి


Sun,September 8, 2019 03:49 AM

వేల్పూర్: అంక్సాపూర్ గ్రామానికి చెందిన పుట్ట గంగామణి(60) అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుట్ట గంగామణి కొంత కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటున్నది. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఆమె కొంతకాలంగా మద్యంకు బానిసైంది. శుక్రవారం మద్యం తాగి గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేసింది. ఆతర్వాత ఇంటికి వెళ్లింది. ఉదయం మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్ పరిశీలించారు. మృతురాలికి ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...