నాలుగో టౌన్‌లో ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు


Sun,September 8, 2019 03:49 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశామని సీపీ కార్తికేయ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ సెంటర్‌లో మహిళా సిబ్బంది ఫిర్యాదుల స్వీకరించి సత్వర న్యాయం కోసం సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారని తెలిపారు. మహిళా బాధితులు పోలీసుస్టేషన్‌కు వస్తే వారితో పూర్తిగా మహిళా పోలీసులు మాట్లాడి వారికి సత్వర న్యాయం అందే విధంగా చూస్తారన్నారు. ప్రతి ఫిర్యాదుదారునికీ ఫోన్‌చేసి వాళ్ల కేసు వివరాలు, వాటి పురోగతిని ఎప్పటి కప్పుడు తెలియజేస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నారని తెలిపారు. ఈ పోలీసుస్టేషన్ నూతన హంగులు అంతరించుకున్న తర్వాత వచ్చిన ప్రతి ఫిర్యాదుదారునికీ కావాల్సిన సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. పోలీస్ స్టేషన్ పూర్తిగా 5ఎస్ విధానంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నూతన హంగులతో తీర్చిదిద్దామన్నారు.

డయల్ 100 కాల్స్ పై పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నిమిషాల్లో సిబ్బంది స్పందిస్తున్నారని అనంతరం వారికి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారన్నారు. ప్రతి ఫిర్యాదు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నమోదు చేసిన సమాచారం ఫిర్యాదుదారునికీ ఎప్పటికప్పుడు తెలియజేసి వారికి రశీదు ఇస్తున్నారని తెలిపారు. నూతనంగా వచ్చిన వాహనాలు నేరాలను నివారించుటకు, చేధించుటకు ప్రజలకు సత్వర న్యాయం అందేలా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ వాహనాలు నేరస్థులపై నిఘా ఉంచడానికి, కమ్యూనిటీ పోలీసింగ్ విధానానికి దోహదపడుతున్నాయన్నారు. ప్రతి శనివారం డ్యూటీ ఆఫీసర్ ద్వారా సమావేశం నిర్వహించి మిగతా సిబ్బంది వర్టికల్ విధానం పకడ్బందీగా అమలు జరిగేలా చూస్తున్నామన్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతుల గది ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం 5ఎస్ పద్ధతి అమలు చేస్తున్నామని దీంతో సిబ్బంది సమయం చాలా ఆదా అవుతూ పని భారం తగ్గుతుందని అన్నారు. ప్రతి నెలా 5ఎస్ పద్ధతిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని మంచి విధులు నిర్వహించిన వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...