సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ


Sun,September 8, 2019 03:48 AM

శక్కర్‌నగర్: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించడమే కాకుండా, చోరీలు, ఇతర సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం సులువుగా ఉంటుందని నిజామాబాద్ అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల చాంబర్‌ను శనివారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీసీ కెమెరాల ఏర్పాటు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బోధన్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లతో పాటు, పట్టణంలోని ప్రవేశించే రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బోధన్ పట్టణంలో సుమారు 13లక్షల 45వేల రూపాయలు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం దాతలను ఆశ్రయించి, వారి వద్ద నుంచి విరాళాలు సేకరించి, జాయింట్ అకౌంట్ ద్వారా డబ్బులను వెచ్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన పట్టణ సీఐ నాగార్జున గౌడ్‌ను ఆయన అభినందించారు. బోధన్ పట్టణంలోని పలువురు ప్రధాన వ్యాపారులు, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఇందుకు అందించిన సహకారం ఎనలేనిదని ఆయన అన్నారు. సీసీ కెమెరాల టెక్నీషియన్ శ్రీనివాస్‌ను అడిషనల్ డీసీపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ రఘు, పట్టణ, రూరల్ సీఐలు నాగార్జున గౌడ్, షాకీర్ అలీ, బోధన్ పట్టణ వర్తకులు ప్రదీప్‌గుప్త, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అధ్యక్షుడు జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...