టెక్నాలజీతో నేరాలు అదుపు


Sun,September 8, 2019 03:48 AM

ఎస్పీ శ్వేతారెడ్డి భిక్కనూరు : టెక్నాలజీ నేరాలను అదుపు చేయడం సులువుగా మారిందని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శనివారం సందర్శించారు. ముందుగా నేరాలకు సంబంధించిన పలు రికార్డులు , సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు టెక్నాలజీ అందుబాటులో లేక నేరాల అదుపునకు ఇబ్బందులు కలిగాయన్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర డీజీపీలు కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారని అన్నారు. పోలీసు సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్ ఫోన్‌లలో నేరస్తుల సమాచారం ఉంటుందని, అనుమానితులు కనిపిసే ఫొటో తీసి అవ్యక్తి ఎక్కడి వాడు, కేసులు నమోదై ఉన్నాయా అనే వివరాలు తెలుసు కోవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కడ అధికంగా జరుగుతున్నాయనే విషయలు తెలుసుకుని అక్కడ ఎక్కువ నిఘా ఏర్పాటుచేసి నేరాలు నియంత్రిస్తున్నామని అన్నారు. ట్యాబ్‌లు సీసీ కెమెరాల మాదిరిగా పని చేస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా నేరాలు దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు చాలా వరకు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి నేరాలు అదుపులోకి తెచ్చేందులు కృషి చెస్తామన్నారు. సీఐ రాజశేఖర్, ఎస్సై రాజు గౌడ్, సిబ్బంది ఉన్నారు.

సీసీ కెమెరాలు లేని చోట చోరీలు అధికం
లింగంపేట: సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో చోరీలు అధికంగా జరుగుతున్నాయని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. కోమట్‌పల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఎస్పీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు సీసీ కెమెరాలు లేని గ్రామాలను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని అడ్లూర్, ధర్మరావుపేట తదితర గ్రామాల్లో సీసీ కెమెరాలు లేని కారణంగా చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వేణుగోపాల స్వామి ఆలయంలో రూ.మూడు కోట్ల విలువ చేసే ఆభరాణాలు అపహరణకు గురైనట్లు తెలిపారు. నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఆరు కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. గ్రామస్తులు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఓకే వినాయకుడని ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ సత్తెన్న, తాడ్వాయి ఎస్సై కృష్ణమూర్తి, లింగంపేట ఎస్సై సుఖేందర్‌రెడ్డి, సర్పంచ్ సుగుణ, ఎంపీటీసీ సభ్యురాలు కల్యాణి, పంచాయతీ కార్యదర్శి సత్యవతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...