అనుమతులు నిల్.. దోపిడీ ఫుల్!


Sat,September 7, 2019 01:13 AM

-అనుమతులు లేకుండానే దవాఖానలు, ల్యాబ్‌ల నిర్వహణ
-తాజాగా బోధన్‌లో వెలుగులోకి ఉదంతం
-జిల్లా వైద్యశాఖ ఉదాసీన వైఖరి ..?
0నోటీసులతో సరి.. చర్యలకు తాత్సారం


నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేటు దవాఖానల్లో దోపిడీ పెరిగిపోయింది. కొన్ని దవాఖానల్లో డెంగీ బూచిని చూపి రోగుల నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారు. ల్యాబ్‌లు ఇష్టానుసారంగా రిపోర్టులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉదాసీనంగా వ్యవహరించడం వీరికి కలిసి వస్తున్నది. మమ్మల్ని అడిగేవారెవ్వరు అనే విధంగా కొన్ని దవాఖానలు, ల్యాబ్‌ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు.

తాజాగా బోధన్‌లో వెలుగుచూసిన ఉదంతాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డొల్లతనాన్ని, ఉదాసీన వైఖరిని బయటపెట్టాయి. సీజ్‌చేసే అధికారం ఉన్నా.. చర్య లు తీసుకోవాల్సిన సందర్భమైనా.. మన అధికారులు మాత్రం వారి మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు. నోటీసులతో సరిపెడుతున్నారు. పోనీ.. ఆ నోటీసులు జారీ అయిన తర్వాత పరిస్థితి ఏమిటని మళ్లీ చూస్తున్నారా? అంటే అదీ లేదు. అలా నోటీసులు తీసుకొని వాటిని చెత్తబుట్టలో పారేస్తున్నారు. అయినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చీమకుట్టినైట్లెనా లేదు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...