ఏటీఎంలతో చోరీలకు పాల్పడుతున్న యువకుడి రిమాండ్


Sat,September 7, 2019 01:11 AM

బాన్సువాడ రూరల్ : ఏటీఎంలలో డబ్బులు తీసుకునేందుకు వచ్చే వారి దృష్టి మరల్చి వారి ఏటీఎంతో చోరీలకు పాల్పడుతున్న ముడావత్ దేవిదాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలినట్లు సీఐ మహేశ్‌గౌడ్ శుక్రవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ముడావత్ దేవిదాస్ గతనెల 21న బాన్సువాడ ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బు లు డ్రా చేసేందుకు వచ్చిన వెంకటేశ్ అనే వ్యక్తి ఏటీఎం పిన్ నంబర్‌ను తెలుసుకొని అతని దృష్టి మరల్చి ఏటీఎం కార్డును దొంగిలించాడు. ఆ ఏటీఎంతో పట్టణంలోని కెన రా బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ.20వేలు డ్రా చేశాడు. బాధితుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దేవిదాస్‌ను గత నెల 28న విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. నేరం రుజువు కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...