గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి


Sat,September 7, 2019 01:10 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఏర్గట్ల మండల కేంద్రం లోని ఆరెకటికె కులస్తులను గ్రామ బహష్కరణ చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరెకటిక సంఘం అధ్యక్షు డు రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆరెకటికె జిల్లా ప్రతినిధులతో కలిసి ఆయన ఆర్మూర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆరెకటిక కులస్తులను బహిష్కరించడం దారుణమన్నారు. గ్రామంలో మాంసం అమ్మే విషయంలో ఆరెకటిక కులస్తులకు రూ.12 వేలను మొదట వీడీసీ వారు జరిమానా విధించినట్లు చెప్పారు. కొంచెం తగ్గించాలని కటిక సంఘ సభ్యులు కోరితే తగ్గించలేదన్నా రు. జరిమానా విధించిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందిస్తే వీడీసీ మరో రూ.8 వేల జరిమానా విధించినట్లు చెప్పారు.

ఈ జరిమానాలు కట్టినందుకు వీడీసీ సభ్యులు గ్రామ బహష్కరణ చేశారని కటిక సంఘ ప్రతినిధులు చెప్పారు. గ్రామాభివృద్ధి కమిటీ వారు వార్డు సభ్యురాలి బ్యూటీపార్లర్‌ను సైతం మూయించి ఆరెకటిక కులస్తులను గ్రామ బహిష్కరణ చేసినట్లు గ్రామంలో చాటింపు చేశారన్నారు. గ్రామంలో తమ కులస్తులను బహిష్కరణ చేశారని, వారి ఖోఖాలను తొలగించారని అక్కడి ఎస్సైకి, ఆర్మూర్‌లో ఏసీపీకి గత శుక్రవారమే ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని, ఇప్పటికీ గ్రామ బహిష్కరణ కొనసాగుతుందన్నా రు. బహిష్కరణ చేసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను, ప్రభుత్వ ప్రతినిధులను వారు కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, డివిజన్ అధ్యక్షుడు బాల్‌కిషన్, ఇస్సాపల్లి శంకర్, మోర్తాడ్ శ్రీను, శ్రీకాంత్, చిరంజీవి, సందిప్, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...