ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు


Sun,August 25, 2019 12:14 AM

ఆర్మూర్ రూరల్/ నందిపేట్: నియోజకవర్గంలోని మండలాల్లో, గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రాఘవేంధర్, కళాశాల చైర్మన్ ప్రజ్ఞా గంగామోహన్, డైరెక్టర్ వంశీ, ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నందిపేట్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...