మొక్కలే జీవకోటికి ప్రాణాధారం


Fri,August 23, 2019 04:14 AM

బోధన్ రూరల్: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి అన్నారు. మండలంలోని కొప్పర్గ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలు నాటి సంరక్షిస్తే వృక్షాలుగా ఎదిగినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఇచ్చిన ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, ఉప సర్పంచ్ సయ్యద్ ఖలీల్, ఎంపీటీసీ పద్మ, గంగాధర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బసవేశ్వర్‌రావ్, ఫత్తేపూర్ సర్పంచ్ అమీర్, శివకుమార్, హన్మంతు, జమీర్, రాములు, లాయక్ ఆరీఫ్, ఫీల్డ్ అసిస్టెంట్ నాగ్నద్ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...