రైతులందరికీ పాస్ పుస్తకాలు అందజేయాలి


Wed,August 21, 2019 03:25 AM

ధర్పల్లి : అర్హులైన రైతులందరికీ నూతన పట్టా పాస్ పుస్తకాలు అందజేయాలని నిజామాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం రాత్రి తహసీల్ కార్యాలయా న్ని తనిఖీ చేసిన ఆర్డీవో ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశా రు. ఎలాంటి అవినీతికి ఆస్కా రం లేకుండా ప్రతి ఒక్కరూ సరిగ్గా పని చేసి రైతులందరికీ నూతన పట్టా పాస్ పుస్తకా లు అందేలా చూడాలన్నారు. పెద్ద ఎత్తున పట్టా పాసుపుస్తకాలు జారీ చేసినందున, మిగిలిన వారి సమస్యల్ని సైతం ఒక్కొక్కటి పరిష్కరిస్తూ భూమి ఉండి ఎలాంటి వివాదాలు లేని వారందరికీ పట్టా పాస్ పుస్తకాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, డీటీ మధు, ఆర్.ఐ. శ్రీనివాస్, వీఆర్వోలు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...