కొనసాగుతున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన


Wed,August 21, 2019 03:25 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ కళాశాలలో వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆధారంగా సీపీజీఈటీ-2019 ప్రవేశాల కోసం డిగ్రీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన మంగళవారం ఐదోరోజూ కొనసాగింది. ఎంఎస్సీ ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టులకు చెందిన 410 మంది విద్యార్థులు హాజరైనట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రవీందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్‌ఐఎఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, టూరిజం మేనేజ్‌మెంట్, జెండర్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామని అన్నారు. అన్ని విద్యాపరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు. డాక్టర్ అతిక్ సుల్తాన్ ఘోరి, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...