ఆసరా పండుగ..


Mon,July 22, 2019 01:55 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: పెరిగిన ఆసరా పింఛన్లను సోమవారం (నేటి) నుంచి పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. పెంచిన పింఛన్‌ను అందుకునే తరుణం లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. జూన్ మాసం నుంచి పెంచిన పింఛన్ అమలులోకి రానుంది. వీటిని సోమవారం నుంచి ఈ నెలాఖరులోగా లబ్ధ్దిదారులందరికీ పంపిణీ చేస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు ఇస్తున్న ఆసరా లబ్ధ్దిదారులందరికీ ఇక డబుల్ పింఛన్ రానున్నది. జిల్లాలో మొత్తం 2,57,735 మందికి ఆసరా పింఛన్ అందుతున్నది. ఇందులో అత్యధికంగా 96,585 మంది బీడీ కార్మికులకు జీవనభృతి అందుతున్నది. వీరందరికీ ఇక రూ.2016లను అందజేయనున్నారు. 10,124 మంది ఒంటరి మహిళలు, 60,297 మంది వృద్ధ్దులు, 199 చేనేత కార్మికులు, 71,818 మంది వితంతువులకు డబుల్ పించన్ రానున్నది. 19,772 మంది దివ్యాంగులకు రూ. 3,016ను అందించనున్నారు. పెరిగిన పింఛన్ పేదల కుటుంబాల్లో కొత్త కాంతులను నింపుతున్నది. పెరిగిన ఆసరా వారి జీవితాలకు భరోసానివ్వనున్నది. వీటి కోసం నెలకు రూ.54 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. బీడీకార్మికులకులతో పాటు వృద్ధ్దాప్య పింఛను లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా మరింత మంది ఆసరా పింఛన్లకు అర్హులు కానున్నారు. దీంతో ఈ వ్యయం మరింత పెరగనుంది. మరింత మందికి ఆసరా భరోసాగా నిలవనున్నది.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...