మూడేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం


Mon,July 22, 2019 01:52 AM

మోపాల్ : మండలం ముదక్‌పల్లి గ్రామానికి చెందిన మూడేం డ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్ అనే 18 ఏం డ్ల యువకుడు లైంగిక దాడి యత్నించినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్‌కుమార్ మూడు రోజుల క్రితం బాలికను ఇంట్లోకి తీసుకొని లైంగికదాడికి యత్నించాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిపింది. ఆమె శనివారం మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు వివరాలను ఎస్సై సతీశ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వివరించారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...