ఎస్‌వీ డిగ్రీ కళాశాల విద్యార్థుల దాతృత్వం


Sun,July 21, 2019 01:13 AM

-పేద కుటుంబానికి పెద్ద రోగం కథనానికి స్పందన
పెద్దకొడప్‌గల్ : మం డలంలోని వడ్లం గ్రామానికి చెందిన స్వరూప రెం డేండ్ల నుంచి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నది. ఆర్థిక పరి స్థితి అంతంత మాత్రం గానే ఉండడంతో దాతల ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 16న నమస్తే తెలంగాణలో వచ్చిన పేద కుటంబానికి పెద్ద రోగం కథనంపై జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం ఎస్‌వీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు దాతృత్వం చాటుకున్నారు. రూ.20 వేలు పోగు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ఎస్‌వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్ మాట్లాడుతూ.. తమ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు కలిసి ఇక నుంచి భరోసానిద్దాం కార్యక్రమం ద్వారా ఆర్థికసాయం చేయాలని నిర్ణయించామన్నారు. స్వరూప కుటుంబ సభ్యులకు అండగా ప్రతి ఒక్కరూ నిలిచి నిండు ప్రాణాన్ని కాపాడాల ని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామ్, వైస్ ప్రిన్సిపాల్ దత్తురాం చారి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గోన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...