చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత


Wed,July 17, 2019 06:13 AM

ఖలీల్‌వాడీ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయాలను సంప్రోక్షన చేసిన అనంతరం 10 గంటల నుంచి భక్తులకు పునఃదర్శనం కల్పించనున్నారు. నిజామాబా ద్‌లోని శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయం, నీలకంఠేశ్వరాలయం, మాధవనగర్ సాయిబాబా ఆలయం, శంభుని గుడి, బోర్గాంలోని లక్ష్మీ గణపతి దేవాలయం, చీర్‌హన్మాన్ మందిరం, సారంగపూర్ హనుమాన్ మందిరం, అయ్యప్ప దేవాలయం, దేవిరోడ్డులోని దేవీమాత ఆలయం, గోల్‌హనుమాన్ ఆలయాలను మూసివేశారు. కామారెడ్డి పట్టణంలో హన్‌మాన్ కాలనీలోని పంచముఖి ఆలయం, గంజి ఆవరణలోని రామాలయం, కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలోని ప్రధాన ఆలయాలు, రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవస్వామి దేవాలయం, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మినరసింహా స్వామి, భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర ఆలయం, తిప్పాపూర్ వేంకటేశ్వర ఆలయం, పెద్దమల్లారెడ్డిలోని వేంకటేశ్వర ఆలయంతో పాటు గ్రామాల్లో ఉన్న ఆలయాలు మూసి ఉంచారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...