విద్యుదాఘాతంతో పంప్‌హౌస్‌ ఆపరేటర్‌ మృతి


Mon,July 15, 2019 02:37 AM

సదాశివనగర్‌ : మండల పరిదిలోని మల్లన్న గుట్టవద్ద ఉన్న మిషన్‌ భగీరథ వాటర్‌ పంప్‌హౌస్‌ ఆపరేటర్‌ విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్‌ గ్రామానికి చెందిన బొప్పా రం నర్సింహులు(36) మిషన్‌ భగీరథ్‌ వాటర్‌ పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగా విధుల్లోకి వచ్చిన నర్సింహులు ఉదయం సుమారు 11 గంటల సమయంలో కరెంటు సైప్లె కాకపోవడంతో సమస్య ఏంటో తెలుసుకునేందుకు సబ్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఫ్యూజ్‌ పోయినట్లుందని పరిశీలిస్తుండగా ఒక్క సారిగా కరెంట్‌ షాక్‌ కొట్టడంతో వెనక్కు పడ్డాడు. ఇది గమనించిన మిగతా ఇద్దరు ఆపరేటర్లు అప్రమత్తమై నర్సింహులు దగ్గరకు వెళ్లి చూడగా ఆయన స్పృహ తప్పి ఉన్నాడు. వెంటనే ఆయనను దవాఖానకు తరలించేందుకు అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అప్పటికే నర్సింహులు మృతి చెందాడని ఎస్సై వివరించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పంప్‌ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే డీఎస్పీ సత్తన్న, సీఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నర్సింహులుకు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని అందజేసేందుకు అధికారులు ఒప్పుకున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...