పజాసేవలో.. న్యాయపీఠాలు


Sat,July 13, 2019 04:34 AM

నిజామాబాద్ లీగల్ : నిజామాబాద్ జిల్లా న్యాయ ప రిధిలో శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అ దాలత్ నిర్వహణకు న్యాయసేవా అధికార సంస్థ విస్తృ త ఏర్పాట్లు చేసింది. ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి కోర్టులతో పాటు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న అన్ని కోర్టుల్లో మొత్తం 18 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏ ర్పాటు చేశారు. ఆర్మూర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి పుష్పలత, జూనియర్ సివిల్ జడ్జి - మున్సి ఫ్ మెజిస్ట్రేట్ భాస్కర్ లోక్ అదాలత్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. బోధన్ అదనపు జిల్లా కోర్టు జడ్జి సూర్యచంద్ర కళ, సీనియర్ సివిల్ జడ్జి శివరాంప్రసాద్, మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఈశ్వరయ్య లోక్ అదాలత్ బెంచ్‌లకు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి సివిల్, క్రిమినల్ కేసులను రాజీ పద్ధతిన పరిష్కరిస్తారు. బాన్సువాడ, బిచ్కుంద మున్సి ఫ్ మెజిస్ట్రేట్ వింద్యానాయక్ సంబంధిత కోర్టుల్లో లోక్ అదాలత్ ప్రిసైడింగ్ అధికారిణిగా వ్యవహరిస్తా రు. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్ అనిత సంబంధిత కోర్టు సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ బెంచ్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి సత్తయ్య, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి, మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాజ్‌కుమార్ లోక్ అదాలత్ బెంచ్‌ల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి.

లోక్ అదాలత్‌ల విశిష్టత..
న్యాయస్థానాల్లో సివిల్, క్రిమినల్ కేసులను కక్షిదారుల ఆమోదం మేరకు రాజీ పద్ధతిన పరిష్కరించడానికి వీలుగా న్యాయసేవా సంస్థ లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నది. సంబంధిత న్యాయస్థానాల న్యా యమూర్తులను న్యాయాధికారులుగా నియమించి, మరొక సీనియర్ న్యాయవాదిని సభ్యుడిగా నియమిం చి కేసులను పరిష్కరించి అవార్డులను జారీ చేస్తారు. ఒకసారి లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసులకు అప్పీల్‌కు అవకాశం లేదు. సివిల్ కేసుల్లో కక్షిదారులు చెల్లించిన కోర్టు ఫీజులను తిరిగి ఇవ్వడం మరో ప్రత్యేకత. లోక్ అదాలత్‌లకు తెలుగులో ప్రజాపీఠాలుగా నామకరణం చేశారు.

సత్వర న్యాయమే ప్రధాన లక్ష్యంగా..
న్యాయ వివాదాలను ఎదుర్కొంటున్న న్యాయార్థులకు సత్వర న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా న్యా యసేవా సంస్థ కృషి చేస్తున్నది. ధనిక, బీద తేడా లే కుండా అందరికీ న్యాయసేవలు కొనసాగించడం, బలహీనవర్గాలకు ఉచిత న్యాయసేవలు అందించడం ఆశయంగా న్యాయసేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒకే రోజు..
దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి రెండో శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు మార్గదర్శకాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రతిరో జూ సంబంధిత న్యాయస్థానాల్లో యథావిధిగా లోక్ అదాలత్‌లలో సివిల్ దావాలు , క్రిమినల్ కేసులు పరిష్కరిస్తున్నారు.

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..
లోక్ అదాలత్‌లో న్యాయ వివాదాలను పరిష్కరించుకోవడానికి వీలుగా కక్షిదారులను చైతన్య పరుస్తున్నాం. న్యాయవాదులు, పోలీసు, ఆబ్కారీ శాఖలతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం తోడ్పాటుతో అధిక సంఖ్యలో లోక్ అదాలత్‌లో వివాదాలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేస్తున్నాం. ప్రజల్లో న్యాయ చైతన్యాన్ని కలిగించడానికి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాం.
-పి.శ్రీసుధ, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి , జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్‌పర్సన్

ప్రజావేదికగా న్యాయపీఠాలు..
నిజామాబాద్ న్యాయ పరిధిలో కక్షిదారులు లోక్ అదాలత్‌లో తమ కేసులను పరిష్కరించుకోవడానికి ఒక ప్రజావేదికగా ప్రజా న్యాయపీఠాలు పనిచేస్తున్నాయి. పౌర సమా జం తోడ్పాటుతో లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించుకుని రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తాం.
- కిరణ్ మహి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడికి పితృవియోగం
నవీపేట : తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షు డు వొక్కేర్ల అవంతి రావుకు పితృవియోగం జరిగింది. నారాయణపూర్ గ్రామ నివాసి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, జిల్లా జే ఏసీ కన్వీనర్‌గా విఠల్‌రావు అందరికీ సుపరిచితుడు. ఈయన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వొక్కేర్ల అవంతిరావు తండ్రి. విఠల్‌రావు వారం రోజుల నుంచి అనా రోగ్యంతో బాధ పడుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విఠల్‌రావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి, శ్రద్ధాంజలి ఘటించారు.

విఠల్‌రావు అంత్యక్రియల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్, ప్రముఖులు..
మలివిడత తెలంగాణ ఉద్యమకారుడు వొక్కేర్ల విఠల్‌రావు అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం నారాయణపూర్‌లో జరిగాయి. విఠల్ రావు అంత్యక్రియల్లో జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రాంకిషన్‌రావు, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ వి.నర్సింగ్‌రావు, నవీపేట ఎంపీపీ సంగెం శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు భవంతి దేవిదాస్, తెడ్డు పోశెట్టి, పురుషోత్తం రావు, మానికేశ్వర్‌రావు, శంకర్ పటేల్, సర్పంచ్ లత, పలువురు టీఆర్‌ఎస్ నాయ కులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని నాడాపూర్ గ్రామానికి చెందిన వొక్కేర్ల విఠల్‌రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే జిల్లా జేఏసీ కో కన్వీనర్ కొనసాగారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మలివిడత ఉద్యమంలో పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...