నగరంలో అర్ధరాత్రి ఆకతాయిల వీరంగం


Thu,July 11, 2019 01:27 AM

నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంలోని ఓ బాలికల వసతి గృహం వద్ద మంగళవారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం సేవించి హంగామా సృష్టిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆకతాయిలు సుభాష్‌నగర్ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్‌పై ఎక్కి మద్యం సేవించి కేకలు పెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాలనీ వాసులు తెలిపిన మేరకు సంఘటన వివరాలు ఇలాఉన్నాయి. నగరంలోని సుభాష్‌నగర్ ప్రాంతంలోని ఓ అద్దె భవనంలో ఎస్సీ బాలికల వసతి గృహం కొనసాగుతుంది. ఈ భవనానికి ఎదురుగానే వాటర్ ట్యాంక్ ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ వాటర్ ట్యాంక్ పై నుంచి అరుపులు,కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకొని చూడగా కొందరు యువకులు మద్యం సేవిస్తూ కనిపించారు. ట్యాంక్ పైనే మూత్ర విసర్జన చేశారు. స్థానికులు వెంటనే మూడో టౌన్ పోలీస్‌లకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్యాంక్‌పై ఉన్న యువకులను కిందకు దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించి న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. యువకుల ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...