డయల్ 100 కు నెల రోజుల్లో 3,141 ఫోన్ కాల్స్


Thu,July 11, 2019 01:26 AM

నిజామాబాద్ క్రైం: రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశానుసారం డయల్ 100 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయశర్మ బుధవారం తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఫోన్‌కాల్స్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. ప్రజల ఫోన్‌కాల్స్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత నెల 10వతేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నుంచి మొత్తం 3,141 ఫోన్‌కాల్స్ వచ్చినట్లు వివరించారు. బ్యాడ్లీ అఫెన్సెస్ 40, యాక్సిడెంట్ 597, ప్రాపర్టీ అఫెన్సెస్ 57, సూసైడ్, సూసైడ్ అటెంప్ట్స్ 81, ఇతర కేసులు 2,341, తప్పుడు (ఫాల్స్) కాల్స్ 25 వచ్చాయని వెల్లడించారు. ఈ ఫోన్‌కాల్స్ వచ్చిన 5 నిమిషాల వ్యవధిలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలాలకు చేరుకొని తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫాల్స్ కాల్స్‌తో సమయం వృథాకావడమే కాకుండా సమస్య ఉన్నవారికి సరైన సమయంలో స్పందించడానికి వీలు లేకుండా పోతుందన్నారు. ఎవరైనా అనవసరంగా డయల్ 100 కు తప్పుడు ఫోన్‌కాల్స్ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అవసరానికి మాత్రమే డయల్ 100ను వాడుకోవాలని సూచించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...