ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నతమైనది స.హ. చట్టం


Wed,July 10, 2019 03:08 AM

ఇందల్వాయి: భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార చట్టం చాలా ఉన్నతమైందని అఖిల భారత ప్రజాసేవ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యాంరావు అన్నారు. మంగళవారం గన్నారం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టం - 2005పై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం దేశంలోని జమ్ముకాశ్మీర్ రాష్ట్రం మినహా అన్ని రాష్ర్టాల్లో గ్రామపంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు ప్రతిపౌరుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో 30 రోజుల్లో ఆయా శాఖలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకోవచ్చన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టవచ్చని చెప్పారు. సెక్షన్ 2 (జి)(ఐ) ప్రకారం భారత పౌరులు ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుని తనిఖీ చేయవచ్చన్నారు. తనిఖీల్లో మొదటి గంట ఉచితమని తర్వాత ప్రతి గంటకు 5 రూపాయల చొప్పున కార్యాలయ ప్రజా సమాచార అధికారికి దరఖాస్తుదారుడు చెల్లించుకోవాలన్నారు. ప్రభుత్వం, అధికారులు 30 రోజుల్లో సహచట్టం కింద పెట్టుకున్న అర్జీకి సమాధానం ఇవ్వాలని సెక్షన్ 19(1) మొదట అప్పీల్ చేసుకోవాలని దీని ద్వారా రాష్ట్ర సమాచార హక్కు చట్టం సెక్షన్ అధికారికి సెక్షన్ 19(3) ప్రకారం ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్‌ఐటీఐ కమిటీ ప్రతినిధి షేక్ జాకీర్‌హుస్సేన్, హెచ్‌ఎం వీరలక్ష్మి, పీఈటీ సురేష్, ఉపాధ్యాయులు నాగలక్ష్మి, రామకృష్ణ, రాంప్రసాద్, యాదగిరి, పవన్, మూర్తి, మోహన్, లక్ష్మీరాజ్యం, బసంత్‌రెడ్డి, రుక్మాబాయి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...