అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


Sun,July 7, 2019 01:22 AM

ఇందూరు : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఖాళీగా ఉన్న (తెలుగు, ఉర్దూ మీడియం, ఒకేషనల్) అతిథి అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు ఆదేశాలతో కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సభ్యులుగా అతిథి అధ్యాపకుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 50శాతం పైన మార్కులు వచ్చిన అభ్యర్థులు తమ దరఖాస్తులను www.cie.telangana.gov.in ద్వారా ఐప్లె చేయాలని కోరారు. ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు తయారు చేసి 20వ తేదీన వెరిఫికేషన్, స్క్రూటినీ నిర్వహిస్తామన్నారు. 22వ తేదీన అతిథి అధ్యాపకులను ఎంపిక చేస్తామన్నారు. 23వ తేదీన అతిథి అధ్యాపకులుగా ఎంపికైన వారు ఆయా కళాశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం సబ్జెక్టుల వారీగా ఇంగ్లీషు 4, హిందీ 4, ఉర్దూ 3, మ్యాథ్స్ 8, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 9, బోటనీ 3, జువాలజీ 3, కామర్స్ 1, సివిక్స్ 2, హిస్టరీ/సివిక్స్ 1, హిస్టరీ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉర్దూ మీడియంలో మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 3, కెమిస్ట్రీ 1, బోటనీ 2, జువాలజీ 2, ఎకనామిక్స్ 1, సివిక్స్ 3, హిస్టరీ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఒకేషనల్ కంప్యూటర్ సైన్స్ 3, కన్స్‌స్ట్రక్షన్ టెక్నాలజీ 1, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 1, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ 1 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...