కొలువుదీరిన కొత్త ఎంపీపీలు


Fri,July 5, 2019 04:15 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో గురువారం కొత్త ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు కొలువుదీరారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. నూతనంగా పాలకవర్గాలకు అభివృద్ధిలో అండగా ఉంటామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి భరోసానిచ్చారు. ప్రజలు నమ్మకంతో గెలిపించారని, శక్తివంచన లేకుండా సేవలందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

ఎంపీటీసీలకు అధికారాలు : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఎంపీటీసీలకు అధికారాలు కల్పించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో, వారికి సేవలందించడంలో సర్పంచులతో పాటు ఎంపీటీసీలు క్షేత్రస్థాయిలో ఉంటారని, వారికి ప్రజలకు సేవలందించే విధంగా అధికారాలు కల్పించే యోచనలో సీఎం ఉన్నారన్నారు. ఎంపీటీసీలకు ఈ తీపికబురు త్వరలోనే అందుతుందని భరోసా కల్పించారు. కొత్త ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు మంచి సేవలందించి ప్రజా జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని సూచించారు. ప్రజల కోసం పనిచేస్తే తగిన గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తొలి ఎంపీపీలు, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారు ప్రత్యేకంగా గుర్తిండిపోతారన్నారు. ఇందుకు తగ్గ సేవలు అందించాలని సూచించారు. భీమ్‌గల్ మండలంలో కాళేశ్వరం-21 ప్యాకేజీ ద్వారా సాగునీటిని అందించి కరువును పారదోలే చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుందన్నారు. ఈ తరుణంలో పనిచేసే ఎంపీటీసీలు ఒక సువర్ణ అధ్యయ స మయంలో పనిచేసిన వారిగా గుర్తుండిపోతారన్నారు. సమస్యలను చె ప్పకోవడానికి వచ్చే ప్రజలకు ఓదార్పును అందించేలా, వారి సమస్యను పరిష్కరించేలా వ్యవహరించాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మో ర్తాడ్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాల పాలకవర్గాల ప్రమాణ స్వీకారాల్లో ఆయ న పాల్గొని ఎంపీపీలను, ఎంపీటీసీలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇది వరకు పనిచేసిన ఎంపీపీలను, జడ్పీటీసీలను సన్మానించారు. నూతనంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు ప్రజలకు మంచి సేవలందించేలా తాను సైతం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు మండల పరిషత్ కార్యాలయాల వద్ద మంత్రి నూతన పాలకవర్గాలతో కలిసి మొక్కలు నాటారు.

ఆర్మూరు సెగ్మెంట్‌లో...
మాక్లూర్ ఎంపీపీగా మాస ప్రభాకర్, నందిపేట్ ఎంపీపీగా వాకిడి సంతోష్‌రెడ్డి, ఆర్మూర్ ఎంపీపీగా పట్క నర్సయ్య ప్రమా ణ స్వీకారం చేశారు. వీరి చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో...
డిచ్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ హాజరయ్యారు. కొత్తగా పాలకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ భారత్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పాలనను అందించి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. డిచ్‌పల్లి ఎం పీపీగా గద్దె భూమన్న, వైస్ ఎంపీపీగా కులాచారి శ్యాంరావులు ప్రమాణ స్వీకారం చేశారు. జక్రాన్‌పల్లి ఎంపీపీగా దీకొండ హరి త, వైస్ ఎంపీపీగా కుంచాల విమల, 13 మంది ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, కోఆప్షన్ మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందల్వాయి మండలంలో ఎంపీపీగా బాదావత్ రమేశ్‌నాయక్, వైస్ ఎంపీపీగా బుసాని అంజయ్య, 11 ఎంపీటీసీలతో పాటు ఒక కోఆప్షన్ మెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్పల్లి మండలంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో ఎంపీపీగా నల్లా సారిక హన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీగా నవీన్‌రెడ్డి, 11 మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ మెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు. సిరికొండ ఎంపీపీగా మాలావత్ సంగీత, వైస్ ఎంపీపీగా తోట రాజగంగయ్య, 10 మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ మెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసెడింగ్ ఆఫీసర్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోపాల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చేత గురువారం ఇన్‌చార్జి ఎంపీడీవో లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్డీవో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీపీ లతకుమారి, వైస్ ఎంపీపీ అనిత, 11 మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ మెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ రూరల్ మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరేశ్‌కుమార్ ఎంపీపీ బానోత్ అనూష, వైస్ ఎంపీపీ సాయిలు, మిగతా ఆరుగురు ఎంపీటీసీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డిని నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.

బోధన్ సెగ్మెంట్‌లో...
బోధన్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గురువారం ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి. బోధన్ ఎంపీపీ చైర్మన్‌గా గుద్దె సావిత్రి రాజేశ్వర్, ఎడపల్లి ఎంపీపీ చైర్మన్‌గా కొండెంగల శ్రీనివాస్, రెంజల్ ఎంపీపీ చైర్మన్‌గా లోలపు రజినీ, నవీపేట్ ఎంపీపీ చైర్మన్‌గా సంగెం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి ఎంపీపీ చైర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కోటగిరి ఎంపీపీ చైర్మన్‌గా వల్లెపల్లి సునీత ప్రమాణ స్వీకారం చేశారు. వర్ని ఎంపీపీ చైర్మన్‌గా మేక శ్రీలక్ష్మి, మోస్రా ఎంపీపీ చైర్మన్‌గా పిట్ల ఉమ, రుద్రూర్ ఎంపీపీ చైర్మన్‌గా అక్కపల్లి సుజాత ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా ప్రాంతాలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్లి వారిని అభినందించారు. ఈ సందర్భంగా రుద్రూర్ ఎంపీపీ కార్యాలయాన్ని, మోస్రాలో ఎంపీపీ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయాలను స్పీకర్ ప్రారంభించారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...