ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుదాం


Thu,June 20, 2019 03:04 AM

ఖలీల్‌వాడి: నీటి సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం తన చాంబరులో నీటి సంరక్షణకు చేపట్టాల్సిన అంశాల గురించి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షం ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీటి సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలని, గ్రామ, పాఠశాల స్థాయిలో వర్షపు నీటి విలువ గురించి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు, నాటకాలు, వీధి నాటకాలు, సామూహిక నృత్య ప్రదర్శనలు తదితర కళారూపాల ద్వారా నీటి పరిరక్షణ ఆవశ్యకతను వివరించాలన్నారు. నీటి సంరక్షణ సక్రమ నిర్వహణ పై ముఖ్య ప్రదేశాలలో వాల్ పెయింటింగ్స్ వేయించాలన్నారు. ప్రతి ఇంటి పైకప్పులో పడిన నీటిని ప్రతి ఇంటిలో ఒక నీటి తొట్టి లేదా సామూహిక ప్రదేశాల్లో నీటి నిల్వల నిర్మాణం శ్రమదానం ద్వారా ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్న నీటి కుంటల నిర్మాణం చెరువులో పూడిక తీయడం, మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో రమేశ్ రాథోడ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్సీ రాజేందర్, జేడీఏ గోవింద్, డీపీవో జయసుధ, గ్రౌండ్ వాటర్ డీడీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...