ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి


Wed,June 19, 2019 02:08 AM

ఖలీల్‌వాడి : పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఖర్చుల వివరాలను ఈ నెల 21లోగా సమర్పించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఎన్నికల ఖర్చుల పరిశీలకులు కిరణ్‌మోహన్, తారా ప్రకాశ్‌తో కలిసి మంగళవారం అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అభ్యర్థులు ఈ నెల 21లోగా ఖర్చుల వివరాలను సంబంధిత ఫారాలు, రిజిస్టర్‌లో సమర్పించాలని తెలిపారు. ఇది ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఒకవేళ ఏ అభ్యర్థి అయిన ఖర్చుల వివరాలు సమర్పించకుంటే ఆరు సంవత్సరాల పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడాని అర్హత ఉండదని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే పేపర్ ప్రకటన ద్వారా, అభ్యర్థులు నేరుగా నోటీసు పంపించామని ఇంకా ఎవరికైనా సమాచారం లేకుంటే చెప్పామని అయినా ఇంకా ఎవరైనా మిగిలిపోతే సమావేశానికి నివేదికలు సమర్పించాల్సిందిగా కోరారు. వారికి అవసరమైన సహకారాన్ని జిల్లా సహకార శాఖ అధికారి, ఖర్చుల నోడల్ అధికారి అందిస్తారని వారి కార్యాలయంలో అవసరమైతే సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి, డీసీవో సింహాచలం, పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...