చదువుతోపాటు క్రీడలూ ముఖ్యం


Wed,June 19, 2019 02:08 AM

నిజామాబాద్ సిటీ / ఇందూరు : విద్యార్థి స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను క్రీడల ద్వారా ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్ మైదానంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రామ్మోహన్‌రావు హాజరై మాట్లాడుతూ జిల్లాలో నాగారం, జక్రాన్‌పల్లి క్రీడా మైదానాల్లో సదుపాయాల ఏర్పాటుకు, క్రీడాకారులకు కావాల్సిన వస్తువులు, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని, 23న జరిగే ఒలింపిక్ డేను పురస్కరించుకొని ముందస్తుగా జిల్లాలో ఒలింపిక్ రన్‌ను నిర్వహిస్తారన్నారు. జిల్లాకు చెందిన సౌందర్య, సౌమ్య, పూర్ణ, నిఖత్ జరీన్, గోదావరి, హుసాముద్దీన్‌తోపాటు మరెందరో క్రీడాకారులు పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పతాకం ఎగురవేసి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో చాటారని, వారి కుటుంబసభ్యులను, కోచ్‌లను అభినందించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎంతో మంది పిల్లలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, క్రీడల ద్వారా మంచి భవిష్యత్తు, ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. అనంతరం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులను శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, జిల్లా ఒలంపిక్ సంఘం మాజీ కార్యదర్శి లింగయ్య, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

శారీరక శ్రమతోనే సంపూర్ణ ఆరోగ్యం
ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
శారీరక శ్రమతోనే సం పూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నా రు. నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో మంగళవారం ఒలింపిక్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ రన్‌ని ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాయామం, రన్నింగ్, జాగింగ్ చేయడంతో ఆ రోగ్యంగా ఉంటామన్నారు. ప్రతి రోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్ రావు, మేయర్ ఆకుల సుజాత, ఫ్లోర్ లీడర్ ఎనగందుల మురళి, కొండపాక రాజేశ్, సుజిత్, సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...