మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి


Tue,June 18, 2019 01:13 AM

రెంజల్ : మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న చ ట్టాలపై పూర్తి అవగాహన కలిగినప్పుడే మన హక్కులను సాధించవచ్చని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీలారాణి అన్నారు. రెంజల్ గ్రామ పంచాయతీ కా ర్యాలయంలో సోమవారం సఖీ షీటీం అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, వరకట్న వేధింపులు, కిడ్నాప్‌లు, గృహ హింస చట్టాలపై మ హిళలు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా సఖీ షీటీం కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా సర్పంచ్ మర్ల రమేశ్, వీఆర్వో సంతో ష్, గ్రామ వీవోలతోపాటు సభ్యులను ఎంపిక చేసినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పేర్కొన్నారు.

ఎడపల్లి : మండలంలోని నెహ్రూనగర్ గ్రామం లో సోమవారం సఖీషీ కమిటీని ఏర్పాటు చేశారు. సర్పంచ్ అమానుల్లా ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వినోద కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ లో వీఆర్వో సతీశ్‌కుమార్ చైర్మన్‌గా, వీవో అధ్యక్షురాలు సమీనాబేగం ఉపాధ్యక్షురాలిగా, కానిస్టేబుల్ గోపాల్‌ను గ్రామ పోలీసు అధికారిగా, క్రిష్ణవేణి (ఆశవర్కర్), పుష్ప (ఏఎన్‌ఎం)ను మెంబర్లుగా నియమించారు. సర్పంచ్ అమానుల్లా షరీఫ్, ఎంపీటీసీ ఇమ్రాన్‌ఖాన్, ఉపసర్పంచ్ ఎస్‌కే ఫిరోజ్‌ను ప్రత్యే క ఆహ్వానితులుగా నియమించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...