దవాఖానల బంద్‌తో రోగుల ఇక్కట్లు


Tue,June 18, 2019 01:12 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: వైద్యులపై దాడులను నిరసిస్తూ చేపట్టిన ప్రైవేట్ దవాఖానల బంద్ సోమవారం నిజామాబాద్ జి ల్లాలో రోగులకు నరకం చూపించింది. ప్రైవేట్ ద వాఖానల యాజమాన్యాలు బంద్‌కు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు చేరవేయడంలో విఫలం కావడంతో చాలా మంది గ్రా మీణ ప్రాంతాల నుంచి యథావిధిగా నిజామాబాద్ నగరానికి వైద్య సేవల కోసం వచ్చారు. సో మవారం ప్రైవేట్ దవాఖానల్లో రోగుల తాకిడి ఎ క్కువగా ఉంటుంది. ఎర్రటి ఎండలో సుదూర ప్రాంతాల నుంచి పసిబిడ్డలను చంకనెత్తుకొని వచ్చిన ప్రజలకు ఇక్కడి దవాఖానలను మూసి ఉండడంతో హతాశులయ్యారు. ఎమర్జెన్సీ సేవలు కొనసాగిస్తామని చెప్పినప్పటికీ, ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. పూర్తిస్థాయిలో దవాఖానలు బంద్ పా టించడంతో రోగులు చాలాసేపు దవాఖానల వద్ద పడిగాపులు కాశారు. చూసిచూసి వేసారిపోయి వెనుదిరిగారు. ప్రభుత్వ దవాఖానల్లో సైతం ఓపీ సేవలు నిలిపి వేయడంతో రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకు వైద్యసేవల బంద్ నరకాన్ని చూపించిం ది. నానా ఇబ్బందుల పాలుచేసింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు తీసుకున్న శ్రద్ధలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు సమాచారం ఇవ్వడంలో మాత్రం చూపలేదు. దీంతో ఎర్రటి ఎండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దవాఖానలకు నిలయమైన నిజామాబాద్ నగరంలో ఖలీల్‌వాడి ప్రాంతం మధ్యాహ్నం తర్వాత నిర్మానుష్యంగా కనిపించింది. నిత్యం జనంతో కిటకిటలాడే ఈ ప్రాంతం బోసిపోయి కనిపించింది.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...