వైద్యులపై దాడులు సరికాదు


Tue,June 18, 2019 01:12 AM

ఖలీల్‌వాడి : వైద్యులు ప్రాణాలు కాపాడేవారని, ప్రాణాలు తీసేవారు కాదని.. వైద్యులపై దాడిచేసి గాయపర్చడం సరైన పద్ధతి కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి అన్నారు. సోమవారం గంగస్తాన్‌లోని ఐఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో వైద్యులపై జరిగిన దాడులకు సంఘీభావంగా జిల్లాలో దవాఖానలు, నర్సింగ్‌హోమ్స్‌లలో ఉదయం 6గంటలకు నుంచి ఓపీ సేవలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజుల్లో కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు. ఒకవేళ వైద్యుని తప్పిదమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వైద్యులపై భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. ఇలాంటి దాడులను నిరోధించడానికి కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, ప్రత్యేక చట్టాలను రూపొందించాలని ఆమె కోరారు. సమావేశంలో తానా అధ్యక్షుడు డాక్టర్ శ్రీశైలం, డాక్టర్లు అనిల్‌కుమార్, వినోద్ పవార్, లింగారెడ్డి, రాజ్‌కుమార్ సుబేదార్, మధుసూదన్, రాంచందర్ రావు, జయిని నెహ్రూ, అజ్జ శ్రీనివాస్, పూర్ణిమా, మళ్లీశ్వరి, వినోద్‌కుమార్, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...