దళిత కుటుంబాలను ఆదుకోవాలి


Mon,June 17, 2019 03:08 AM

లింగంపేట: మండలంలోని జల్దిపల్లి గ్రామంలో సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను ఆదుకోవాలని ఆల్ ఇండియా సమతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దానక్క సంగమేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎదుట గ్రామానికి చెందిన పోతుగంటి పెద్ద సాయిలు కుర్చీలో కూర్చోవడంతో సాయిలును సర్పంచ్ కులం పేరుతో దూషించాడని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. దీందో దళితుల కాలనీలో మురికి కాల్వలు శుభ్రం చేయించక పోవడంతో పాటు తాగునీటి సరఫరా నిలిపివేసి సామాజిక బహిష్కరణకు గురి చేశారని తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు దళితుల పక్షాన తాము పోరాడుతామని తెలిపారు. సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రత్యేకంగా తాగునీటి బోరు, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని కోరారు. నాయకులు అంజయ్య, నరేశ్, ఆనంద్ తదితరులు ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...