పల్లె పాలనకు ‘పవర్‌'


Sun,June 16, 2019 03:05 AM

-సర్పంచ్‌, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌
-గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
-జిల్లాలో 530 జీపీల్లో గాడిన పడనున్న పాలన
-సర్పంచుల్లో సంతోషం
-ఉప సర్పంచుల్లో హర్షం
కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఎన్నికల కోడ్‌ ముగియడంతో పాలన పై పూర్తిస్థాయిలో ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రధానంగా గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఈనెల 17 నుంచి చెక్‌పవర్‌ అందజేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు కలిపి జా యింట్‌ చెక్‌పవర్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల సర్పంచు లు, ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ రానుండడంతో జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పాలన సజావుగా సాగనుంది. గ్రామాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో గాడిన పడనున్నా యి. చెక్‌ పవర్‌తో సర్పంచుల్లో ఉత్సాహం నెలకొంది.చెక్‌ పవర్‌ భాగస్వామ్యం కల్పించడంతో ఉప సర్పంచుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.

వరుస ఎన్నికల నేపథ్యంలో ఆలస్యం...
రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఫిబ్రవరి 2 న బాధ్యతలు స్వీకరించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో చెక్‌ పవర్‌ నిర్ణయం లో కొంత ఆలస్యం కావడంతో పంచాయతీ పాలక వర్గాలు చెక్‌ పవర్‌ కోసం ఎ దురు చూస్తున్నాయి. దీంతో ఎన్నికల సం దడి ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించింది.చెక్‌ పవర్‌ రావడంతో జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో ఆయా అవసరాల కోసం నిధుల వినియోగం ప్రారంభం కానుంది.నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో అభివృద్ధి, సదుపాయాల కల్పన, సౌకర్యాల నిర్వహణ,పారిశుధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో గాడిలో పడనుంది.సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం తీర్మానాలు చేసి అమలు చేసుకునే పవర్‌ పంచాయతీలకు చెక్‌ పవర్‌తో ప్రారంభమైంది.

151 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు...
జిల్లాలో కొత్తగా 151 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. 71 గిరిజన పంచాయతీలు ఏర్పాటు చేశారు. ‘మా గ్రామాల్లో.. మా పాలన’ అనే ఆకాంక్ష నెరవేరిన కొత్త పంచాయతీల్లో తొలి సర్పంచులు, ఉప సర్పంచులు తొలిసారిగా చెక్‌పవర్‌ అందిన ఆనందంలో తమ గ్రామాల అభివృద్ధికి ఉత్సాహంతో అడుగులు వేయనున్నారు.నూతన పంచాయతీరాజ్‌ చట్టం తేవడమే కాకుం డా పంచాయతీల్లో కార్యదర్శుల కొరత లేకుండా ఇటీవలే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు చెక్‌పవర్‌ ఇవ్వడంతో పంచాయతీలు సేవలు అందించనున్నాయి.

ఉప సర్పంచుల్లో హర్షాతిరేకం...
సర్పంచులతో కలిపి తమకు చెక్‌పవర్‌ కల్పించడంపై ఉప సర్పంచుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.పంచాయతీలకు ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ వ్యవస్థ పోయి కార్యదర్శుల వ్యవస్థ వచ్చాక ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ లేదు.ఎంతో కాలానికి ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ రావడంతో గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచుల క్రియాశీల పాత్ర పెరగనుందని పరిశీలకులు భావిస్తున్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...