రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ కృషి


Sun,June 16, 2019 03:02 AM

వేల్పూర్‌ : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తుందని వేల్పూర్‌ సొసైటీ చైర్మన్‌, ఇఫ్‌కో డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సొసైటీలో ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న సోయా విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమ కోసం ఇంతలా కృషి చేయలేదన్నారు. రైతులకు సాగునీరు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, సబ్సిడీపై విత్తనాలు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు పెట్టుబడి, ఇన్సూరెన్స్‌ ఇంకా ఎన్నో సదుపాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్పిస్తున్నారన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలు పట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. మంత్రి కృషితో మండలంలోని నవాబ్‌ లిఫ్ట్‌ ద్వారా కాలువల మరమ్మతు పనులకు నిధులు మంజూ రైనట్లు తెలిపారు. కాలువల మరమ్మతు పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు లిఫ్ట్‌ ద్వారా నీరు చేరుకుంటుదన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ భీమ జమున, సర్పంచ్‌ తీగల రాధ, మోహన్‌, సొసైటీ ఉపాధ్యక్షుడు మోహన్‌, డైరెక్టర్లు నల్లవెల్లి శ్రీనివాస్‌, వినోద్‌, రాజన్న, కార్యదర్శి గంగాదాసు, సిబ్బంది గంగాధర్‌, కృష్ణ, కోటగిరి సతీశ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...