సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం


Sat,June 15, 2019 02:59 AM

-తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న ప్రక్రియ
-మొదటి రోజు 560 మంది పోలీస్‌ అభ్యర్థులు హాజరు
నిజామాబాద్‌ క్రైం : తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను శుక్రవారం సీపీ కార్తికేయ సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రా రంభమైన ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి సూచనల మేరకు సబ్‌ ఇన్‌స్పెక్ట ర్‌ ఆఫ్‌ పోలీస్‌, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఎంపికలో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. ఈ పరిశీలన ప్రక్రియ ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనునట్లుగా పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. మొద టి రోజు 560 మంది అభ్యర్థులను పిలువగా.. అంద రూ హాజరయ్యారు.

ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్‌ కాపీల పరిశీలన..
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక సమయంలో పొం దుపర్చిన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ మెమోలు (ప్రొవిజినల్‌ లేదా పట్టా), స్టడీ కండాక్ట్‌ (4వ తరగతి నుంచి 10వ తరగ తి వరకు), కులధ్రువీకరణ పత్రాలు, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌, ఎక్స్‌ సర్వీసుమన్‌ సర్టిఫికెట్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌, హోమ్‌గార్డు, పోలీసు ఎగ్జిక్యూట్‌ అభ్యర్థుల సర్వీస్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, స్పోర్ట్స్‌ తదితర అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అన్ని ఒరిజినల్‌తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌లను పరిశీలించారు. ఇందుకోసం 10 కౌంటర్లు, ఎడిటింగ్‌, మాడిఫికేషన్‌ కోసం ఒక కౌంటర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వెరిఫికేషన్‌ కోసం ఒక కౌంటర్‌, అడ్మిన్‌ కౌంటర్‌ ఒకటి చొప్పున ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రణాళికతో పరిశీలన నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు..
పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే దళా రుల మాటలు నిమ్మ మోసపోవద్దని సీపీ కార్తికేయ అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రోకర్ల సమాచారం అందించడానికి పోలీస్‌ శాఖ 94906 18000 సెల్‌ నంబర్‌ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమం లో అదనపు డీసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి, ఎన్‌ఐబీ ఏసీపీ రాజారత్నం, ఏవో సత్యకుమార్‌, శ్రీనివాస్‌, మక్సూద్‌ హైమద్‌, గోవింద్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌ స్పెక్టర్‌ మధుసూదన్‌, ఆర్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...