విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ


Sat,June 15, 2019 02:58 AM

బాన్సువాడ రూరల్‌ : మండలంలోని బోర్లం ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సర్పంచ్‌ సరళ ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సర్కారు పాఠశాలల బలోపేతం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు ముందస్తుగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేసి అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, అధ్యాపక బృందానికి, గ్రామానికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ పుట్టి విజయలక్ష్మి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు మహేశ్‌, రాములు, శ్రీనివాస్‌గౌడ్‌, సరిత, శ్రావణ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.
మైలారంలో..
నస్రుల్లాబాద్‌ : మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్‌ ఓండ్ల యశోద మహేందర్‌ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మహేందర్‌, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
పిట్లంలో
పిట్లం: మండలకేంద్రంలోని ఉర్దూమీడియం పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ఉపసర్పంచ్‌ ఇబ్రహీం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే విద్యారంగ వ్యవస్థ మెరుగుపడిందని, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఫన్నాలాల్‌, కోఆప్షన్‌ సభ్యుడు కరీం, నూతన కోఆప్షన్‌ సభ్యుడు రహిమాన్‌, కమిటీ సభ్యులు నయీం, హైమద్‌ తదితరులు పాల్గొన్నారు.
మహమ్మద్‌నగర్‌లో..
నిజాంసాగర్‌,నమస్తే తెలంగాణ: మండలంలో పలు గ్రామాల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను చేశారు. మహమ్మద్‌నగర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విద్యార్థులకు సర్పంచ్‌ దఫేదార్‌ బాలమణి, నాయకులు దఫేదార్‌ విజయ్‌, వాజిత్‌, మహేందర్‌ పంపిణీ చేశారు. బ్రాహ్మణపల్లి పాఠశాలలో సర్పంచ్‌ ఎర్రోల్ల సాయిలు, ఉప సర్పంచ్‌ జి. వెంకటేశం, నిజాంసాగర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌రావు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...