పిల్లలను బడికి పంపాలి


Sat,June 15, 2019 02:58 AM

బాన్సువాడ రూరల్‌ : బడిఈడు పిల్లలను తప్పని సరిగా బడికి పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని స్వేరో సర్కిల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్‌ అన్నారు. శుక్రవారం తాడ్కోల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాజారాం దుబ్బలో స్వేరో సర్కిల్‌ సభ్యులు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని పలువురు తల్లిదండ్రుల స్వేరో సభ్యులను కోరారు. కాలనీలో ఉంటున్న చాలా మంది పిల్లలు పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్‌ వస్తువులను సేకరిస్తూ పాఠశాలలకు వెళ్లడం లేదని తెలుపగా ఈ విషయమై ఆర్‌సీవోతో సంప్రదించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వేరో సభ్యుడు అమీన్‌, విద్యార్థుల తల్లిదండ్రులు కాలనీవాసులు ఉన్నారు.
ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ర్యాలీ
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌లో శుక్రవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ బడిబాటను పురస్కరించుకొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీటీసీ వెంకటరమణ ర్యాలీని ప్రారంభించారు. బడీఈడు పిల్లలను తప్పని సరిగా బడిలో చేర్పించాలని కోరుతూ ర్యాలి చేపట్టారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్‌లో..
నస్రుల్లాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలలో నే నాణ్యమైన విద్యాబోధన అందిస్తారని, బడి బయటపిల్లలను బడిలో చేర్పించాలని ఎంపీపీ విఠల్‌ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉల్లెంగ బాలరాజు, జడ్పీటీసీ జన్నుబాయి, ప్రతాప్‌, ఉపాధ్యాయులు శ్రీచందు, రమేశ్‌, గోదావరి, కతిజాబేగం ఉన్నారు.
పిట్లంలో..
పిట్లం: మండలంలో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అన్నారంలో సర్పంచ్‌ కాశీరాం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. బడి మానేసిన విద్యార్థులను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయుడు బలరాం, విద్యార్థులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...