మలేరియా నివారణకు అందరూ సహకరించాలి


Sat,June 15, 2019 02:56 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ : మలేరియా వ్యాధి ని పారదోలడానికి అందరూ ముందుండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో ని 30 పడకల వైద్యశాలలో తుకారాం రాథోడ్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ వోటర్‌ బర్న్‌ డిసీస్‌ కంట్రోల్‌ ప్రో గ్రామ్‌ను జాతీయ కీటక ని వారణ కార్యక్రమంలో భా గంగా ప్రత్యేక కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మలేరియా, చికున్‌గున్యా, డెంగీ జ్వరా లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అసంక్రమణ వ్యాధుల సర్వే గురించి సమీక్షించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీపీవో డాక్టర్‌ సికిందర్‌నాయక్‌, డాక్టర్‌ శుభాకర్‌, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వై.శంకర్‌, ఆరోగ్య ప ర్యవేక్షకులు సుధాకర్‌, సవిత, అక్బర్‌అలీ, రోజా, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గర్భిణులకు పౌష్ఠికాహారాన్ని అందించాలి..
డిచ్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో పోషణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆరో గ్య విస్తీర్ణ అధికారి వై.శంకర్‌ మాట్లాడుతూ.. పాలు, గుడ్లు, ఆకు కూరలు, కూరగాయలు గర్భి ణులకు అందించాలని సూచించారు. విటమిన్లు, మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు సుధాకర్‌, సవిత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సరస్వతీ, కళావతి, సీడీపీవో సునీత, అన్ని గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...