విద్యార్థులు ఇష్టంతో చదవాలి : డీఈవో


Sat,June 15, 2019 02:56 AM

నిజామాబాద్‌ రూరల్‌ : విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే పరీ క్షల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చని డీఈవో దుర్గాప్రసాద్‌ అన్నా రు. శుక్రవారం గూపన్‌పల్లి హైస్కూల్‌ను ఆయన సందర్శించి విద్యా ర్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించకుండా ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని సూచించారు. దీని వల్ల ప్రైవే ట్‌ పాఠశాలల్లో చెల్లించే వేలాది రూపాయలు మిగులుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సాయిలు, ప్రధానోపాధ్యా యుడు సాయన్న, ఉపాధ్యాయులు సంగీత, మంజులత, అంజయ్య, ఘనపురం దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...