ఫీజుల దోపిడీపై నియంత్రణపై చర్యలేవీ?


Fri,June 14, 2019 04:09 AM

ఇందూరు: ఫీజుల నియంత్రణ విషయంలో అ ధికారుల అలసత్వం తల్లిదండ్రులకు శాపంలా మారింది. జిల్లాలో విద్యావ్యాపారం జోరుగా సా గుతున్నా.. విద్యాశాఖఅధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీవో నంబరు 1 ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశాల్లో ఫీజులను నిర్ణయిస్తారు. యూని ఫాం, పుస్తకాల విక్రయాలు వంటివి చర్చకు వస్తా యి. తల్లిదండ్రులతో సమావేశాల అనంతరం తీ ర్మానాల ప్రకారం ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల ధరలు నిర్ణయించుకోవాల్సి ఉంది. కానీ, జిల్లాలో ఎక్కడా గవర్నింగ్ బాడీ సమావేశాలు ని ర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని అధిక ఫీజులు, డొనేషన్లు పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపాయి. అయి నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా.. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సమర్థించుకోవడం గమనార్హం. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఈ విషయంలో ఫిర్యాదులు చేయడం లేదు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పి తమ దందా కొనసాగిస్తున్నాయి.

అధికారుల కాలయాపన ధోరణి ప్రైవేటు యాజమాన్యాలకు కలిసొచ్చింది. రూ.వేలల్లో డొనేషన్లు, విద్యాసంవత్సరానికి రూ.20వేల నుంచి 40 వేల వరకు ఫీజులు వ సూలు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీ వ్రంగా నష్టపోతున్నారు. ఫీజుల వివరాలను పాఠశాల ఆవరణలో బోర్డు ఏర్పాటు చేసి ఉం చాల్సి ఉంచాలి. కానీ, పలు పాఠశాలలు ఆ నిబంధనలకు పాతర వేస్తున్నాయి. అయినా విద్యా శాఖ అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 600 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. అనేక పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నవే. మెరుగైన వసతులు, కం ప్యూటర్ ల్యాబ్‌లు, విశాలమైన క్రీడామైదానాలు, డిజిటల్ క్లాసుల పేరిట అందిన కాడికి ప్రైవేటు యాజమాన్యాలు దండుకుంటున్నాయి. అయినా అధికారులు మామూలుగానే తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...