బ్యాంకు అకౌంట్ ఫీడింగ్ త్వరగా పూర్తి చేయాలి


Fri,June 14, 2019 04:08 AM

నిజామాబాద్ రూరల్ : ఉపాధి కూలీలు పని చేసినందుకు బట్వాడా డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నందున తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ ఫీడింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రూరల్ ఎంపీడీవో డాక్టర్ సంజీవ్‌కుమార్ సూచించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధిహామీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సర్పంచులతో సమన్వయంతో మెలిగి వారి సూచనలను కూడా ఉపాధిహామీ సిబ్బంది పాటించాలన్నారు. హరిత హారం కార్యక్రమం విజయవంతంగా చేసేందుకు ఇప్పటి నుంచే సిబ్బంది ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. నర్సరీల్లో పెంపకం చేస్తున్న మొక్కలకు సక్రమంగా నీరు పోయాలని సూచించారు. సమావేశంలో ఏపీవో పద్మ, ఇన్‌చార్జి ఈసీ ఉమేష్‌కుమార్, టెక్నికల్ అసిస్టెంట్లు హరీందర్, ప్రభాకర్‌రెడ్డి, సాయిప్రసాద్, అరుంధతీ, ఉమ్మడి మండలాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...