పోచారం బిజీ బిజీ


Fri,June 14, 2019 04:07 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆరు నెలలుగా సమీక్షలు, సమావేశాలకు దూరంగా ఉన్న బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం గతంలో ఆయన తెచ్చిన నిధులతో కొనసాగుతున్న పనులు, గ్రామాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాసమస్యలను విని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు పాఠశాలల పునః ప్రారంభం కావడంతో పాఠశాలలో పిల్లల సంఖ్య, వసతి గృహాల్లో మౌలిక వసతులు, గ్రామాల్లో ప్రజలకు తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...