నూతన ప్రజాప్రతినిధులకు సన్మానం


Fri,June 14, 2019 04:07 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ : ఇటీవల ఎన్నికైన ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్, డిచ్‌పల్లి జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరను గురువారం టీఆర్‌ఎస్ మండల నాయకులు శాలువ, పూలమాలలతో సత్కరించారు. నగరంలోని బాజిరెడ్డి నివాసంలో మండలాధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో జగన్‌కు శాలువ, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం డిచ్‌పల్లి జడ్పీటీసీ సభ్యురాలు ఇందిర నివాసానికి వెళ్లి శాలువ, పూలమాలలతో సత్కరించి అభినందన లు తెలిపారు. అభినందించిన వారిలో సర్పంచులు రాథోడ్ జగదీశ్, గుడాల లింగం, తేలు గణేశ్, పార్టీ నాయకులు పులి వెంకటేశ్వర్‌రావు, లక్ష్మీనర్సయ్య, కుమ్మరి గంగాధర్, మంగలి కిషన్ పాల్గొన్నారు.

ఎంపీపీని సన్మానించిన అంగన్‌వాడీలు
ముప్కాల్ : ముప్కాల్ ఎంపీపీగా నూతనంగా ఎన్నికైన సామపద్మ వెంకట్‌రెడ్డిని గురువారం మండలంలోని అంగన్‌వాడీ టీచర్లు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రానికి చెందిన సామపద్మ ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు వాణి, జ్యోతి, అమీనాబేగం, వరలక్ష్మి, నాగలక్ష్మి, త్రివేణి పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...